: గుడుంబాను అరికట్టడానికే చీప్ లిక్కర్!: కేసీఆర్
గుడుంబా వల్ల కుటుంబాలు నాశనమైపోతున్నాయని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 'గుడుంబాను అరికట్టడానికే చీప్ లిక్కర్' అంటూ స్పష్టం చేశారు. తాము ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పారు. చీప్ లిక్కర్ పై రాద్ధాంతం చేస్తున్న విపక్ష నేతలు గుడుంబాను ఎలా అరికట్టాలో మాత్రం చెప్పరని మండిపడ్డారు. చీప్ లిక్కర్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతున్నప్పటికీ... ప్రజల శ్రేయస్సు కోసమే చీప్ లిక్కర్ ను తెస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే గొప్పవాళ్లమవుతామని విపక్ష నేతలు అనుకుంటున్నారని... ఇది సరికాదని హితవు పలికారు. దీంతోపాటు, కేజీ టు పీజీ విద్య ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. దీనిపై గట్టి కసరత్తు జరుగుతోందని... కొంత జాప్యం జరిగినా ఈ విద్యావిధానాన్ని తీసుకొస్తామని తెలిపారు.