: తప్పొప్పుకున్న యాపిల్... సరిచేస్తాం, తీసుకురండంటూ పిలుపు!


గతేడాది మార్కెట్ లోకి విడుదల చేసిన ఐఫోన్ 6ప్లస్ స్మార్ట్ ఫోన్ కెమెరాలో లోపాలు ఉన్నాయని యాపిల్ కంపెనీ ప్రకటించింది. దీంతో లోపాలు సరిచేస్తామని, సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని పిలుపునిస్తోంది. 2014 సెప్టెంబర్ నుంచి 2015 జనవరి మధ్య మార్కెట్ లోకి విడుదలైన బ్యాచ్ కెమెరాల్లో లోపాలు ఉన్నాయి. దీంతో ఆ స్మార్ట్ ఫోన్ లతో ఫోటోలు తీసుకుంటే క్లారిటీ ఉండడం లేదు సరికదా, పిక్చర్ బ్లర్ అవుతోంది. దీంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన యాపిల్ సంస్థ కెమెరాల్లో లోపాలు ఉంటే యాపిల్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని, లేని పక్షంలో 'యాపిల్ సపోర్ట్' యాప్ సహాయం తీసుకోవచ్చని సూచించింది.

  • Loading...

More Telugu News