: హ్యాట్రిక్ కొట్టాం... ఇక తిరుగులేదు: మోదీ
బెంగళూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ విజయం అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సంబరాలు జరుపుకున్నారు. బీజేపీని నమ్మి విజయాన్ని కానుకగా అందించిన బెంగళూరు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కన్నడ ప్రజలకు రుణపడి వుంటానని చెప్పిన ఆయన, కర్నాటక బీజేపీ నేతలకు, బీబీఎంపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో విజయం అనంతరం, బెంగళూరు ఫలితాలు బీజేపీకి హ్యాట్రిక్ గెలుపును అందించాయని, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అభివర్ణించారు. బీజేపీపై ప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైందని, దేశంలోని 125 కోట్ల మంది ప్రజల కోరికలు తీర్చేందుకే తాము ప్రయత్నిస్తామని మోదీ వ్యాఖ్యానించారు.