: నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి సంతాపం... గవర్నర్ కు లేఖ
ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ సంతాపం తెలిపారు. రైలు ప్రమాద ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ కు ఆయన లేఖ రాశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో కర్ణాటక ఎమ్మెల్యే వెంకటేశ్ నాయక్ సహా ఐదుగురు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.