: తెలంగాణలో కొత్తగా 40 మండలాల ఏర్పాటు
తెలంగాణలో కొత్తగా 40 మండలాలు ఏర్పాటు కానున్నాయని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. రాష్ట్ర జనాభా, అవసరాలను పరిగణనలోకి తీసుకుని మండలాల సంఖ్యను పెంచుతున్నారు. ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక మండలం ఉండేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పాతికేళ్ల క్రితం మండలాలు ఏర్పాటయ్యాయని... అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా ఎంతో పెరిగిందని... ఈ నేపథ్యంలో మండలాల సంఖ్య పెంచక తప్పని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రతి జిల్లాలో మూడు నుంచి నాలుగు కొత్త మండలాలు ఏర్పడనున్నాయి. కొత్త మండలాలు ఏర్పడితే ప్రజలకు, పాలనకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.