: మోదీతో కేజ్రీ భేటీ... చంద్రబాబు బయటకు రాగానే లోపలికెళ్లిన ఢిల్లీ సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధానితో దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఈ భేటీ జరుగుతుండగానే అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అధికార నివాసానికి చేరుకున్నారు. మోదీతో భేటీ ముగించుకుని చంద్రబాబు బయటకు రాగానే వెనువెంటనే కేజ్రీవాల్ లోపలికి వెళ్లారు. ప్రధానితో కేజ్రీవాల్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.