: ఏపీకి స్పెషల్ కాదు... స్పెషల్ స్పెషల్ స్టేటస్ వస్తుంది: సుజనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను మించిన ఆదరణ కేంద్రం నుంచి లభిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం శాఖ సహాయమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి స్పెషల్ కాదు, స్పెషల్ స్పెషల్ స్టేటస్ వస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా అన్న పదం వాడేందుకు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని రాయితీలు, ప్రయోజనాలు వస్తాయో, వాటన్నింటినీ సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సుజనా తెలియజేశారు. దీంతో, నిన్నమొన్నటి వరకూ ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని చెబుతూ వచ్చిన సుజనా చౌదరి, నేడు హోదా రాదు, వివిధ ప్యాకేజీలతో కూడిన రాయితీలు ఉంటాయని చెప్పకనే చెప్పినట్లయింది.