: చిన్న వివాదం మహిళ ప్రాణాలు తీసింది!


కడప జిల్లా మైదుకూరు మండలం జన్నావరం గ్రామంలో జరిగిన స్వల్ప ఘర్షణతో ఓ మహిళ ప్రాణాలు పోయాయి. ఆ గ్రామంలో తెల్లవారు జామున మండ్ల వెంకటమ్మ(55) అనే మహిళ తన ఇంటి ముందు కళ్లాపి చల్లుతోంది. ఆ సమయంలో పక్కింటి నాగసుబ్బమ్మ గుమ్మం ముందు కళ్లాపి పడింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో నాగసుబ్బమ్మ, ఆమె కుటుంబ సభ్యురాలు చంద్రకళ కలసి వెంకటమ్మపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను మైదుకూరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వెంకటమ్మ ప్రాణాలు విడిచింది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News