: మోదీతో చంద్రబాబు భేటీలో యనమల... సీనియర్ ఐఏఎస్ లు పీవీ రమేశ్, సతీశ్ చంద్ర కూడా!


రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయిన ఏపీకి కేంద్రం వెన్నుదన్నుగా నిలవాల్సిందేనన్న డిమాండ్ తో కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ కోసం రోజుల తరబడి అధికారులు తీవ్ర కసరత్తు చేసి సమగ్ర నివేదికలు రూపొందించారు. ఈ నివేదికలు పట్టుకుని చంద్రబాబు కొద్దిసేపటి క్రితం మోదీతో భేటీకి వెళ్లారు. చంద్రబాబు వెంట ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు పీవీ రమేశ్, సతీశ్ చంద్రలు ఈ భేటీకి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News