: కారులో కూర్చుని పేపర్లు సర్దుకున్న చంద్రబాబు... ప్రధానితో భేటీకి ముందు ఆసక్తికర దృశ్యం


ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేక భేటీకి వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అనుకున్న మేర లక్ష్యాన్ని సాధించుకుని తీరాలన్న పట్టుదలతో ఉన్నట్టుంది. ప్రధానితో భేటీ నేపథ్యంలో కేంద్రం వద్ద ప్రస్తావించాల్సిన పలు అంశాలపై అధికారులు రూపొందించిన నివేదికను ఇప్పటికే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన చంద్రబాబు మళ్లీ మళ్లీ వాటిని పరిశీలిస్తున్నారు. నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు మరోమారు అధికారులతో భేటీ అయినట్లు సమాచారం. తాజాగా నేటి ఉదయం సదరు నివేదికను పట్టుకుని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వద్దకెళ్లిన చంద్రబాబు, అక్కడి నుంచి నేరుగా ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు. వెంకయ్య ఇంటి నుంచి బయలుదేరిన ఆయన కారులో వెళుతున్నంత సేపూ నివేదికను మరోమారు పరిశీలించారు. ప్రధాని నివాసం వద్ద కారు ఆగిన విషయాన్ని కూడా మరిచిపోయిన ఆయన నివేదికలోనే నిమగ్నమయ్యారు. కారు డోరు తీసేందుకు వచ్చిన సిబ్బందిని గమనించిన ఆయన ఆ తర్వాత నివేదికలోని పత్రాలను సర్దుకుని కారు దిగి ప్రధాని నివాసంలోకి వెళ్లారు.

  • Loading...

More Telugu News