: ఏపీ, తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం: రాజ్ నాథ్ సింగ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తే ఇరు రాష్ట్రాలు అభివృద్ధిపై దృష్టి పెడతాయని అన్నారు. అంతకుముందు ఢిల్లీలో వెంకయ్యనాయుడి నివాసానికి వచ్చిన రాజ్ నాథ్ అప్పటికే అక్కడికి వచ్చిన సీఎం చంద్రబాబుతో ఏపీ సమస్యలు, ప్రధాని మోదీతో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడారు. సమావేశం తరువాత మీడియాతో పైవిధంగా మాట్లాడారు.