: పవన్ కల్యాణ్ ను టీడీపీ ఎప్పటికీ గౌరవిస్తుంది...ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఉద్ఘాటన


జనసేనాధిపతి, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ను తెలగుదేశం పార్టీ ఎప్పటికీ గౌరవిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా పవన్ కల్యాణ్ తో తమ పార్టీ సత్సంబంధాలనే కోరుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. నవ్యాంధ్ర రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ పై పవన్ కల్యాణ్ ఘాటు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్లపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా పలువురు మంత్రులు అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. వీరిపై మొన్నటి పెనుమాక పర్యటనలో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చినరాజప్ప వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News