: సాక్ష్యాలు చెరిపేస్తున్నారు... పాక్ లో మాయమైన నవేద్ కుటుంబం


భారత సరిహద్దు భద్రతా జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై దాడి జరిపి దొరికిపోయిన పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్ కుటుంబం ఆనవాళ్లను ఎవరికీ దొరక్కుండా చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం. నవేద్ తమ దేశానికి చెందిన వాడు కాదని ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు తాను ఫైసలాబాద్ నుంచి వచ్చానని నవేద్ చెప్పినప్పటికీ, అతనిచ్చిన ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తే 'నేనో దురదృష్టవంతుడైన నాన్నను' అని అతని తండ్రి వాపోయినప్పటికీ పాక్ మాత్రం తన మాటపైనే నిలిచింది. కాగా, ఇప్పుడు నవేద్ తండ్రి, అతని సోదరుడు యాకూబ్, బావమరిది తాహిర్, ఉద్యోగమిచ్చిన సలామత్ అలీ, లష్కరేతోయిబాకు పరిచయం చేసిన బషీర్ తదితరుల ఫోన్లేవీ పనిచేయడం లేదు. వారందరి ఆచూకీ గురించిన సమాచారం కూడా దొరకడం లేదు. పాక్ ప్రభుత్వం నిర్వహించే నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (ఎన్ఆడీఆర్ఏ) సమాచారం నుంచి నవేద్ పేరును డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News