: బెంగళూరులో గెలుపు దిశగా బీజేపీ... వెనుకబడ్డ అధికార కాంగ్రెస్ పార్టీ
కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 197 వార్డులకు గాను తాజా సమాచారం ప్రకారం 56 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం సాధించగా, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 38 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక జేడీఎస్ అభ్యర్థులు 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఐదు స్థానాల్లో ఇతరులు విజయం దిశగా సాగుతున్నారు. నేటి మధ్యాహ్నం లోగా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.