: ఉల్లి 'సెంచరీ' కొట్టేస్తుంది!


గడచిన కొద్ది వారాలుగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. ఈ ధరల పెరుగుదల ఎంతవరకు? దేశ రాజధాని మార్కెట్లో కిలోకు రూ. 80 దాటిన ఉల్లిపాయల ధర, నేడో రేపో రూ. 100ను దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం కనీస ఎగుమతి ధరను పెంచి, దిగుమతులను ప్రోత్సహిస్తున్నా ఉల్లిపాయల ధర మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. మహారాష్ట్రలో వర్షాలు సంతృప్తికరంగా లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని తెలుస్తోంది. శనివారం నాడు నాసిక్ జిల్లాలోని ప్రముఖ ఉల్లి మార్కెట్ లాసల్ గావ్ లో కిలో ఉల్లి ధర రూ. 57కు చేరింది. సెప్టెంబర్ 2013లో ఉల్లిపాయల ధర కిలోకు రూ. 55గా నమోదు కాగా, ఆ రికార్డు బద్దలైంది. ఇక మంగళవారం నాడు కిలో ఉల్లి ధర రూ. 60 దాటింది. టోకు మార్కెట్లో రూ. 60 అంటే, రిటైల్ మార్కెట్ కు చేరేసరికి దాని ధర మరో రూ. 25 నుంచి రూ. 30 వరకూ పెరుగుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఉల్లి సెంచరీ కొట్టడం ఖాయమంటున్నారు నిపుణులు.

  • Loading...

More Telugu News