: కార్యరంగంలోకి దూకేసిన చంద్రబాబు... వెంకయ్యతో భేటీ అయిన ఏపీ సీఎం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్దేశిత షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే కార్యరంగంలోకి దూకేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తదితరాల సాధన కోసం నిన్న రాత్రికే ఢిల్లీ చేరుకున్న ఆయన నేటి ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే భేటీతో తన ఢిల్లీ పర్యటనను ప్రారంభిస్తారని అంతా భావించారు. అయితే అంతకు కాస్త ముందుగానే కార్యరంగంలోకి దూకేసిన చంద్రబాబు, కొద్దిసేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ సందర్భంగా ఏ తరహా వ్యూహంతో వెళితే బాగుంటుందన్న విషయంపై ఆయన వెంకయ్యతో ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాక కేంద్రం వైఖరిపై కాస్తంత ముందస్తు అవగాహన కోసమే ఆయన ముందుగా వెంకయ్యతో భేటీ అయినట్లు తెలుస్తోంది. వెంకయ్యతో భేటీ అనంతరం చంద్రబాబు నేరుగా ప్రధాని అధికారిక నివాసానికి బయలుదేరతారు.

  • Loading...

More Telugu News