: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు... డాలర్ తో బలపడ్డ రూపాయి


చైనా దెబ్బతో నిన్న నష్టాల పరంపర ఎదురైనా నేడు భారత మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సెన్సెక్స్ 370 పాయింట్లకు పైగా లాభపడింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 90 పాయింట్ల మేర లాభంతో ప్రారంభమైంది. ఇక నిన్న డాలర్ తో పొలిస్తే రూపాయి మారకం విలువ కూడా కొద్దిమేర బలపడింది. నిన్నటితో పోలిస్తే 25 పైసలు బలపడ్డ రూపాయి మారకం విలువ 66.39గా వద్ద కొనసాగుతోంది. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆదే ఊపును కొనసాగించే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News