: సమస్యంతా బయటి దేశాల నుంచే!: మార్కెట్ పరిస్థితిపై ప్రధాని సమీక్ష
మార్కెట్ల మహా పతనం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. సంస్కరణల అజెండాతో ముందుకు సాగాలని, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. సమస్యంతా బయటి దేశాల నుంచే వస్తోందని, అంతర్గతంగా భారత మూలాలు బలంగా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లపై ప్రధాని సమీక్ష జరిపారని, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారని తెలిపారు. ప్రభుత్వ వ్యూహంలో మార్పేమీ ఉండదని, మదుపరులను ఆకర్షించేందుకు చర్యలు కొనసాగుతాయని మంత్రి తెలియజేశారు. ఇండియాలో ద్రవ్యోల్బణం అదుపులో వుండటం ఆర్థిక వ్యవస్థకు కలిసివచ్చే అంశంగా పేర్కొన్నారు.