: అశ్విన్ 700 వికెట్లు పడగొడతాడు...భారత స్పిన్నర్ పై లంక బౌలింగ్ దిగ్గజం ప్రశంస


భారత టెస్టు జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి నిన్న లంకపై విజయంతో తొలి టెస్టు విక్టరీ చేజిక్కింది. ఈ విజయంలో రెహానే బ్యాటింగ్ తో పాటు అశ్విన్ స్పిన్ బౌలింగ్ ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ రెంటిలోనూ ఐదు వికెట్లతో శ్రీలంక బ్యాటింగ్ ను కుప్పకూల్చిన అశ్విన్ స్పిన్ మాయాజాలం మరింత కీలకమని క్రీడా పండితులు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా లంక బౌలింగ్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, అశ్విన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘బంతిని గాల్లో ఎక్కువ సేపు ఉంచగలగడం అశ్విన్ కు సానుకూలాంశం. బౌన్స్ ను కూడా రాబట్టుకుంటున్నాడు. అదే అతడికి వికెట్లు పడగొడుతోంది. అతడి వయసు ఇప్పుడు 28 ఏళ్లు. మరో పదేళ్ల పాటు అతడు భారత్ కు ఆడగలిగితే 700 వికెట్లు కచ్చితంగా తీస్తాడు’’ అని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News