: బెజవాడ చంద్రబాబు క్యాంప్ ఆఫీస్ లో ఆగంతుకుడు... కత్తితో వీరంగం చేసిన వైనం


విజయవాడలోని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో నిన్న ఓ ఆగంతుకుడు హల్ చల్ చేశాడు. పటిష్ఠ భద్రతను దాటుకుని అతడు ఏకంగా క్యాంపు కార్యాలయంలోకి అతి సులువుగానే చేరుకున్నాడు. ఆ తర్వాత జేబులో నుంచి కత్తి బయటకు తీసి ‘‘మా భూములు లాక్కుంటారా?’’ అంటూ నానా హంగామా చేశాడు. తమ కళ్లుగప్పి కార్యాలయంలోకి చొరబడటమే కాక కత్తి బయటకు తీసి వీరంగం చేస్తున్న ఆ వ్యక్తిని చూసి పోలీసులు హడలిపోయారు. అతడిని చుట్టుముట్టి ఎట్టకేలకు బంధించారు. అతడి గురించి విచారించగా, స్థానికంగా బిక్షాటన చేసుకునే అప్పారావుగా తేలింది. అతడికి మతిస్థిమితం కూడా లేదని తెలిసి పోలీసులు అతడిని వదిలేశారు.

  • Loading...

More Telugu News