: పవన్ కల్యాణ్ రైతులను రెచ్చగొడుతున్నారు: మాణిక్యాలరావు
రాజకీయ స్వార్థంతోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆయన మాట్లాడుతూ, కేవలం 3000 ఎకరాల రైతులను రెచ్చగొట్టేపనిలో జనసేన ఉందని అన్నారు. రాజధానికి భూముల సేకరణ ఇంచుమించు పూర్తి కావచ్చిందని ఆయన తెలిపారు. 90 శాతం భూములు రాజధాని నిమిత్తం రైతులు స్వచ్చందంగా ఇచ్చారని, మిగిలిన పది శాతమే భూసేకరణ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇతర పార్టీలు స్వార్థం విడనాడి రాజధాని నిర్మాణంలో సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.