: రిటైరయ్యారు... ఒకరినొకరు అభినందించుకున్నారు!
శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా లెజెండ్ మైకేల్ క్లార్క్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం తెలిసిందే. సుదీర్ఘ కెరీర్లకు ముగింపు పలికిన ఈ ఆటగాళ్లు పరస్పరం అభినందించుకున్నారు. అద్భుతమైన కెరీర్ తో అలరించావంటూ క్లార్క్ ట్వీట్ చేశాడు. సంగాకు శుభాకాంక్షలు తెలుపుతూ, గొప్ప ఆటగాడని, నికార్సైన వ్యక్తిత్వం ఉన్నవాడని కొనియాడాడు. బదులుగా సంగా కూడా అదే రీతిలో ట్వీట్ చేశాడు. నీ ఆటను చూడడం మహదావకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. సుసంపన్న వారసత్వాన్ని తర్వాతి తరం ఆటగాళ్లకు వదిలి వెళుతున్నావంటూ కీర్తించాడు. కాగా, సంగా ఓటమితో కెరీర్ కు వీడ్కోలు పలకగా, క్లార్క్ విజయంతో కెరీర్ ను ముగించాడు.