: కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో కదంతొక్కిన జైనులు


రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా జైన మతస్థులు హైదరాబాదులో కదంతొక్కారు. జైనులు అత్యంత పవిత్రమైనదిగా భావించే సంథారా ఉపవాసదీక్షను ఆత్మహత్యగా పరిగణిస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా జైనులు శాంతి ర్యాలీ నిర్వహించారు. సనత్ నగర్ లోని జైనభవన్ నుంచి బేగంపేట వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా, సంథారా అత్యంత పవిత్రమైనదని, మత విశ్వాసాలను అనుసరించే స్వేచ్ఛ తమకు ఉందని పేర్కొటూ ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ పాల్గొనగా, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గోవడం విశేషం.

  • Loading...

More Telugu News