: దొంగల వెంటే పోలీసులూ దూకారు!


పంజాబ్ పఠాన్ కోట్ ప్రాంతంలో సినీ ఫక్కీలో ఓ చేజింగ్ జరిగింది. ఇద్దరు చెయిన్ స్నాచర్లు ఓ బైక్ ను దొంగిలించి, దానిపై వెళుతూ ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు తెంచుకుపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేజింగ్ ప్రారంభించారు. గొలుసు దొంగలను వెంటాడారు. ఇక, పోలీసులు తమను వదిలేలా లేరని భావించిన ఆ దొంగలిద్దరూ చక్కీ నదిలోకి తొలుత బైక్ ను విసిరేశారు. ఆపై ఇరువురూ దూకేశారు. ఇది గమనించిన పోలీసులు తమ వాహనాలను నిలిపివేసి, తాము కూడా నదిలోకి జంప్ చేశారు. పోలీసులకు స్థానికులు కూడా తోడవడంతో దొంగలు తప్పించుకోలేకపోయారు. ఆ ఇద్దరు దొంగలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బైక్ ను, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఆ చోరులను దలీప్ కుమార్, అతని బావమరిది జతీందర్ కుమార్ గా గుర్తించారు.

  • Loading...

More Telugu News