: "యు ఆర్ ఏ గ్రేట్ అమ్మ"... జయను కీర్తించిన అసెంబ్లీ స్పీకర్
తమిళనాడులో సీఎం జయలలిత ఓ దేవత అయితే, అన్నాడీఎంకే నేతలు ఆమెకు వీరభక్తులు! 'అమ్మ' అంటూ ఎనలేని విధేయత ప్రకటిస్తారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల తొలి రోజు స్పీకర్ పి.ధనపాల్ కూడా తన భక్తిని శక్తిమేర చాటే ప్రయత్నం చేశారు. సభలో ఆయన ప్రసంగిస్తూ జయను వేనోళ్ల కీర్తించారు. "మీరు కుట్రను జయించారు. యు ఆర్ ఏ గ్రేట్ అమ్మ" అని పేర్కొన్నారు. ఆర్కే నగర్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించారంటూ కొనియాడారు. 'అమ్మ'కు సరిసమానులెవరూ లేరన్న విషయాన్ని ఈ విజయం నిరూపించిందని అన్నారు. 'అమ్మ' ఆయురారోగ్యాలతో, పేరుప్రతిష్ఠలతో, సంపదతో వర్ధిల్లాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ధనపాల్ ఈ వ్యాఖ్యలు చేస్తుండగా అధికార పక్ష సభ్యుల హర్షధ్వనాలతో సభ దద్దరిల్లిపోయింది.