: సైబర్ దాడులకు తెగబడుతున్న ఐఎస్ఐఎస్
వినూత్నమైన రీతిలో భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రాణాలను బలిగొంటున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ఇన్నాళ్లూ భౌతిక దాడులకు పరిమితమైన ఐఎస్ఐఎస్ ఇప్పుడు సాంకేతిక దాడులకు తెరతీసింది. ధాయ్ లాండ్ కు చెందిన ఆరు ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేసింది. ట్యునీషియా నుంచి ఈ చర్యకు పాల్పడినట్టు ఐఎస్ఐఎస్ తెలిపింది. ప్రభుత్వ అధికారిక సైట్లు చూసేవారికి రోహింగ్యా ముస్లింలకు సంబంధించిన ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఈ ఫోటోలతో ఓ ప్రకటన కూడా దర్శనమిస్తోంది. 'మీరంతా మా ప్రజలకు గౌరవం ఇవ్వాలి. మాదంతా ఫల్లాగా బృందం. అంతా ముస్లిములమే. మేము శాంతియుతంగా ప్రజలను ప్రేమిస్తాం' అని పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్ కు చెంది ఫల్లాగ్ గస్సిర్నీ, డాక్టర్ లామౌంచి ఈ ప్రకటన విడుదల చేశారు. గతంలో ఇజ్రాయెల్, ఫ్రెంచ్ సైట్లను హ్యాక్ చేసిన బృందం కూడా ఇదే. ప్రభుత్వ సైట్లపై హ్యాకింగ్ దాడులు సర్వసాధారణమని, సమస్యను పరిష్కరిస్తున్నామని థాయ్ సాంకేతిక మంత్రి తెలిపారు.