: ఉల్లిపాయలు దోచుకుపోయారు!
కలికాలం అంటే ఇదేనేమో...సాధారణంగా దొంగలు డబ్బు, దస్కం దోచుకెళ్లిపోవడం గురించి విన్నాం. దోపిడీ దొంగలు అన్నీ దోచుకునేవారని చదువుకున్నాం. కానీ ఉల్లిపాయల కోసం దొంగలు రావడం వింతే మరి. వివరాల్లోకి వెళ్తే...మహారాష్ట్రలోని నాసిక్ లో పిపర్ ఖెడ్ గ్రామంలోని ఓ రైతు గోడౌన్ నుంచి 20 క్వింటాళ్ల (రెండు వేల కేజీలు) ఉల్లిపాయలను దొంగలు దోచుకెళ్లిపోయారు. ఈ ఉదయం గోడౌన్ కు వెళ్లి చూడగా, ఉల్లిపాయలు దొంగతనానికి గురైన విషయం గుర్తించాడు. దీంతో, రైతు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం కేజీ ఉల్లిపాయలు 80 రూపాయలు ధర పలుకుతున్నాయి.