: మన దేశంలోనే కాదు, అమెరికాలో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతాయి


ప్రయాణిస్తుండగా బస్సులు, రైళ్లలో నిండు గర్భిణులు ప్రసవించడం మన దేశంలో మామూలే... అమెరికాలో మాత్రం అరుదే. కానీ అచ్చం భారత్ లో జరిగినట్టు ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన కారులో ఓ మహిళ ప్రసవించిన ఘటన చోటుచేసుకుంది. న్యూజెర్సీ నగరంలో రోజ్ అనే మహిళకు గత రాత్రి నొప్పులు రావడంతో భర్త ట్రేవర్ అబడ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. రోజ్ కు నొప్పులు ఎక్కువైపోవడంతో విషయం తెలుసుకున్న ఇద్దరు మహిళలు ఆమె ప్రసవించడంలో సహాయం చేశారు. దీంతో రోజ్ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. దీంతో ఆనందం పట్టలేకపోయిన అబడ్ రోడ్డుపై ఉన్న జనాలను ఆలింగనం చేసుకుని హర్షం వ్యక్తం చేశాడు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించిన అబడ్ మాట్లాడుతూ, పాప చనిపోయిందని భావించానని, ఇద్దరు మహిళలు సాయం చేయడంతో ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు.

  • Loading...

More Telugu News