: భావితరాలకు రతన్ టాటా ఆదర్శనీయుడు!: చంద్రబాబు


ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా భావితరాలకు ఆదర్శనీయుడని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి ఆయన వ్యాపారం చేస్తున్నారని, వ్యాపారానికి గౌరవం తెచ్చిన వ్యక్తి రతన్ టాటా అని కీర్తించారు. ఏపీ అభివృద్ధికి రతన్ లాంటి వ్యక్తుల సహకారం అవసరమన్నారు. మానవ వనరుల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. అమరావతి నిర్మాణ దశలో ఉండగా టాటా సంస్థ ముందుకు రావడం సంతోషమని సీఎం చెప్పారు. విజయవాడలో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో టాటా, బాబు పాల్గొన్నారు. 264 గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్టు ప్రణాళిక రూపొందించిందని, 10 లక్షల జనాభాకు సంబంధించిన సమాచారం సేకరించినట్టు చంద్రబాబు వివరించారు. ఈ క్రమంలో టాటా ట్రస్ట్ తో ఒప్పందం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. స్టార్టప్, ఇంక్యుబేషన్ కంపెనీలను ప్రమోట్ చేయాలని టాటాను కోరామని, ఇందుకు రతన్ టాటా సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు 10వేల గ్రామాలను దత్తత తీసుకున్నారని చెప్పిన సీఎం, ఇంకా ఆరువేల గ్రామాల దత్తతకు ఎన్ఆర్ఐలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు.

  • Loading...

More Telugu News