: పాకిస్థాన్ కు ఆ ధైర్యం ఉందా?: ఆర్కే సింగ్


పాకిస్థాన్ ప్రభుత్వానికి భారత్ తో యుద్ధానికి దిగే ధైర్యముందా? అని బీజేపీ నేత ఆర్కే సింగ్ సవాలు విసిరారు. మాజీ హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే సింగ్ ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్నారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దావూద్ పై భారత్ కోవర్టు ఆపరేషన్ కు సిద్ధపడితే పాకిస్థాన్ యుద్ధానికి వస్తుందనే భయం చాలామందిలో ఉందని అన్నారు. అయితే మనతో యుద్ధానికి దిగేంత మూర్ఖత్వం పాకిస్థాన్ కి ఉందని భావించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక వేళ అందరూ ఊహించినట్టు పాకిస్థాన్ యుద్ధానికి దిగితే దానిని నిలువరించగల శక్తి భారత్ కు ఉందని ఆయన స్పష్టం చేశారు. చర్చల పట్ల చిత్తశుద్ది లేని పాక్ తో మరోసారి చర్చలు కొనసాగించే కంటే...చర్యలకు దిగడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్ తో చర్చల విషయంలో ప్రధాని మోదీకి సలహాదారులు సరైన సలహాలు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో దావూద్ ఇబ్రహీంను కోవర్టు ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టే ప్రయత్నం జరిగిందని, అయితే దానిని పోలీసులు భగ్నం చేశారని ఆయన పేర్కొన్నారు. దావూద్ పాక్ లో ఉన్నాడన్న సాక్ష్యాన్ని సంపాదించిన తరువాత మీనమేషాలు లెక్కించడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News