: వేధించాడు, కావాలంటే ఫొటో తీసుకోమన్నాడు... దొరికిపోయాడు!


ఢిల్లీలో మహిళల భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ రాజధాని నగరంలో మహిళలపై జరిగే దారుణాలు అన్నీ ఇన్నీ కావు. వేధింపుల సంగతి సరేసరి. ఆదివారం రాత్రి తిలక్ నగర్ వద్ద కూడా ఓ వేధింపుల ఘటన చోటుచేసుకుంది. జస్లీన్ కౌర్ అనే యువతి ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని. ఆమెపై సరబ్ జిత్ అనే పోకిరి వేధింపులకు దిగాడు. విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. "ఏం చేస్తావ్? కావాలంటే నన్ను ఫోటో తీసుకో" అంటూ రెచ్చిపోయాడు. ఇదే అదనుగా జస్లీన్ అతడి ఫొటో క్లిక్ మనిపించి, దాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అతడి మోటార్ సైకిల్ నెంబర్ కూడా ఆ పోస్టులో పేర్కొంది. ఆమె తెగువ పట్ల స్పందించిన మీడియా కూడా సహకరించింది. దాంతో, సరబ్ జిత్ ను గుర్తించడం, రాజౌరీ గార్డెన్ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పడు, ఢిల్లీ మహానగరంలో జస్లీన్ కౌర్ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News