: ప్రత్యేక హోదా వస్తుందా? రాదా?... చంద్రబాబును నిలదీసిన ఎమ్మెల్యే రోజా


సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపైన, ఏపీకి ప్రత్యేక హోదాపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అని సూటిగా అడిగారు. అసలు హోదాకు చంద్రబాబు అనుకూలమో లేక వ్యతిరేకమో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఎన్డీఏలో కొనసాగుతారా? అని చంద్రబాబును రోజా నిలదీశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రత్యేక హోదా కోసమా? లేక పదవి కాపాడుకోవడానికా? అని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని అడిగారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నారాయణ విద్యాసంస్థల్లో మరణాలపై ఎందుకు సమగ్ర విచారణ చేపట్టరని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికారంలోకి రాగానే కోట్లు దోచుకుని ఇతర రాష్ట్రాల్లో పోటీకి టీడీపీ సిద్ధమవుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ టీడీపీ నేతలపై ఉద్యమించాలని, లేకపోతే ఆయనను ప్రజలు నమ్మరని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News