: తలలు తెగ్గోస్తా... బ్రిటన్ కు హెచ్చరికలు పంపిన జిహాదీ జాన్
తలలు తెగ్గోస్తానంటూ బ్రిటన్ కు జిహాదీ జాన్ హెచ్చరికలు పంపాడు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పట్టుకున్న విదేశీయుల తలలను మేకల్ని కోసినట్టు కోసే కరుడుగట్టిన తీవ్రవాది జిహాదీ జాన్ ముఖం బాహ్య ప్రపంచానికి ఐఎస్ఐఎస్ పరిచయం చేసింది. ఐఎస్ఐఎస్ విడుదల చేసిన తాజా వీడియోలో జీహాదీ జాన్ కనిపించాడు. 1.17 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో స్వదేశీయులను (బ్రిటన్ దేశీయులను) హెచ్చరించాడు. 'నేను మహ్మద్ ఎమ్వాజీని...త్వరలోనే బ్రిటన్ వస్తా... అక్కడ కూడా తలలు తెగ్గోసేపని కొనసాగిస్తా'నని జిహాదీ జాన్ ప్రకటించాడు. దీంతో బ్రిటన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంత వరకు జిహాదీ జాన్ ఎలా ఉంటాడోనని ఊహాగానాలు చేసి, ఊహా చిత్రాలు విడుదల చేసి, అతనిని మట్టుబెడితే సరిపోతుందని భావించిన అధికారులు, ఇప్పుడు అతని మూలాలు వెలికి తీసేపనిలో పడ్డారు.