: స్వదస్తూరీతో సంగాకు లేఖ రాసిన కోహ్లీ... ట్విట్టర్లో పోస్టు చేసిన బీసీసీఐ


ప్రపంచ క్రికెట్లో ఓ మహా అధ్యాయం ముగిసింది. అలుపెరగని సైనికుడిలా ఏళ్ల తరబడి సేవలందించిన ఓ దిగ్గజం కొలంబో టెస్టు అనంతరం ఆటకు వీడ్కోలు పలికిన వేళ అందరి గుండెలూ బరువెక్కిపోయాయి. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే ఓ లేఖతో తన స్పందన వెలిబుచ్చాడు. స్వదస్తూరీతో లంక బ్యాటింగ్ శిఖరానికి రాసిన ఆ లేఖలో..."డియర్ సంగా" అంటూ మొదలుపెట్టి "మున్మందు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా" అంటూ ముగించాడు. "ముందుగా, ఓ వ్యక్తిగా నీవు తెలిసుండడం అత్యంత సంతోషదాయకమని భావిస్తాను. నీ క్రికెట్ ఘనతలను వర్ణించేందుకు మాటలు కరవయ్యాయి. ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతవు నీవు, మరెందరికో దారి చూపావు. నువ్వు ఆడిన కాలంలో ఆడడం నా అదృష్టమనుకుంటా. థాంక్యూ సంగా. నీకు, నీ కుటుంబానికి దైవాశీస్సులు ఉండాలని కోరుకుంటాను" అని కోహ్లీ తన లేఖలో పేర్కొన్నాడు. కాగా, ఈ లేఖను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. లేఖతో పాటు కోహ్లీ-సంగా ఫొటోను కూడా పోస్టులో పొందుపరిచింది. ఈ పోస్టుకు విశేష స్పందన లభిస్తోంది.

  • Loading...

More Telugu News