: 'ఐపీఎల్' విచారణ కమిటీ కార్యాలయంలో దొంగలు పడ్డారు!


ఢిల్లీలో లోథా కమిటీ కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆమధ్య జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇటీవలే ఆ కమిటీ తన నిర్ణయాలు ప్రకటించింది కూడా. కాగా, వసంత్ కుంజ్ లో ఉన్న ఆ కమిటీ కార్యాలయంలో కొంత నగదు, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ విచారణకు సంబంధించిన కొన్ని పత్రాలను దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఆఫీసు తాళం పగిలిపోయి ఉండడం గమనించిన సెక్యూరిటీ గార్డు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. అందుబాటులో ఉన్న సీసీీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News