: భూసేకరణ విషయంలో వారిద్దరి తీరులో తేడా ఉంది: గాలి ముద్దుకృష్ణమ
నవ్యాంధ్ర రాజధాని భూసేకరణ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందనపై టీడీపీ నేతలు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఆయన్ను విమర్శించకుండా భూసేకరణకు ఒప్పించే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, భూసేకరణ విషయంలో పవన్ తీరు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు వేరన్నారు. రైతులను రెచ్చగొట్టి రాజధానిని అడ్డుకోవాలని జగన్ చూస్తుంటే, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని పవన్ సూచించారని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతుల భూములను బలవంతంగా లాక్కుని రైతులకు కనీసం మెరుగైన ప్యాకేజీ కూడా ఇవ్వలేదని గాలి విమర్శించారు. కానీ రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చిన ఘనత టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుదని చెప్పారు.