: గన్నవరం విమానాశ్రయంలో రతన్ టాటాకు ఎంపీ నాని, టీడీపీ నేతల స్వాగతం
టాటా ట్రస్టు ఛైర్మన్ రతన్ టాటా కొద్దిసేపటి కిందటే విజయవాడ చేరుకున్నారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ ఎంపీ కేశినేని నాని, పలువురు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. ఈ మధ్యాహ్నం ఆయన సీఎం చంద్రబాబుతో అక్కడి క్యాంప్ కార్యాలయంలో సమావేశం అవుతారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 264 గ్రామాలను టాటా ట్రస్ట్ దత్తత తీసుకునేందుకు అంగీకరించింది. ఈ గ్రామాల అభివృద్ధి పనులు చేపట్టేందుకే ఆయన ఇవ్వాళ విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్ట్ రూపొందించిన ప్రణాళికను చంద్రబాబు, రతన్ టాటా సంయుక్తంగా విడుదల చేయనున్నారు.