: కోడిగుడ్డు విషయంలో సీరియస్ అయిన గవర్నర్


పాలమూరు జిల్లా కిషన్ బాగ్ గ్రామజ్యోతి కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, కూలీలతో గవర్నర్ మాట్లాడారు. అనంతరం, స్థానికంగా ఉన్న విద్యార్థుల హాస్టల్ ను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ, కోడిగుడ్డు వారానికి ఎన్నిసార్లు పెడుతున్నారని అడిగారు. వారానికి ఒక్కరోజు పెడుతున్నారని విద్యార్థులు చెప్పడంతో... నరసింహన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారానికి రెండుసార్లు ఇవ్వాల్సిన గుడ్డును ఒక్కసారే ఎందుకిస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్క హాస్టల్ లోనే ఈ పరిస్థితి ఉందా? లేక జిల్లా మొత్తం ఇదే పరిస్థితి ఉందా? కనుక్కోవాలంటూ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

  • Loading...

More Telugu News