: గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్... గ్రామ సమస్యలపై ఆరా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఈరోజు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కిషన్ నగర్ గ్రామంలో జరిగిన ఆ కార్యక్రమంలో గ్రామ సమస్యలను సర్పంచి, కమిటీ సభ్యులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రంలో పౌష్టికాహారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో విద్యార్థులతోనూ గవర్నర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే అంజయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.