: డీఆర్ డీవోతో బాబా రాందేవ్ సంస్థ ఒప్పందం


డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీవో)తో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఓ ఒప్పందం చేసుకుంది. కొన్ని ఔషధ, ఆహార ఉత్పతులను దేశ విదేశాల్లో మార్కెట్ చేసేందుకుగానూ ఈ ఒప్పందం జరిగింది. ఈ మేరకు డీఆర్ డీవోకు చెందిన 'డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్' (ది హార్) తయారుచేసిన సీబక్ థార్న్ (రేగిపండు లాంటి పళ్ళు) ఆధారిత ఉత్పత్తుల పరిజ్ఞానాన్ని పతంజలి సంస్థకు బదలాయించేందుకు లైసెన్స్ కు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ, సీబక్ థార్న్ విశిష్ట ఉత్పత్తి అని అన్నారు. దాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు పతంజలి ఆయుర్వేద సంస్థ దృష్టి సారించాలని సూచించారు.

  • Loading...

More Telugu News