: నాందేడ్ ఎక్స్ ప్రెస్ ఘటనపై దర్యాప్తుకు చంద్రబాబు ఆదేశం


అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత, జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. క్షతగాత్రులకు సాయం అందించాలని చెప్పారు. అంతేగాక ప్రమాద ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి వెంటనే నివేదిక అందించాలని అనంత కలెక్టర్ కు సీఎం ఆదేశాలు ఇచ్చారు. గత అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News