: నాంపల్లి కోర్టుకు వైఎస్ జగన్... వచ్చే నెల 14కు ఈడీ కేసు వాయిదా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జగన్ పై సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ కేసు విచారణకు హాజరయ్యేందుకే జగన్ కోర్టుకు వచ్చారు. జగన్ తో పాటు ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ సంస్థల ఆడిటర్ విజయసాయిరెడ్డి కూడా నేటి విచారణకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి సెప్టెంబర్ 14కు వాయిదా వేశారు.