: ‘బేర్’ మన్న మార్కెట్లు... సెన్సెక్స్ 950 పాయింట్ల పతనం
భారత స్టాక్ మర్కెట్లు భారీగా పతనమయ్యాయి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 950 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 250 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. మార్కెట్ల ‘బేర్’ దెబ్బతో రూపాయి మారకం విలువ కూడా బారీగా పతనమైంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.49కు దిగజారింది. ఈ విలువ రెండేళ్ల కనిష్టంతో సమానమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రారంభంలోనే నష్టాలు నమోదైన మార్కెట్లు సాయంత్రానికి మరింత మేర దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.