: పవన్ కల్యాణ్ నోట ‘జేపీ’ మాట... అమరావతి నిర్మాణంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలన్న జనసేనాధిపతి


నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి, పెనుమాకలో నిన్న పర్యటించిన సందర్భంగా జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ పలు కీలకాంశాలను ప్రస్తావించారు. నవ్యాంద్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం నిపుణుల సలహాలను తీసుకోకుండానే ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన నోట మాజీ ఐఏఎస్, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) పేరు వినిపించింది. జేపీ లాంటి అనుభవజ్ఞుల సలహాలు , సూచనలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుకు సూచించారు.

  • Loading...

More Telugu News