: అండమాన్ ‘స్థానిక’ పోరులో దిగనున్న టీడీపీ... చంద్రబాబు నిర్ణయం


తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట దివంగత నందమూరి తారకరామారావు ఏర్పాటు చేసిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇప్పటికే టీడీపీ పేరు, సైకిల్ గుర్తుతోనే దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, త్వరలో అండమాన్, నికోబార్ దీవుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిన్న తనతో భేటీ అయిన పార్టీ అండమాన్ , నికోబార్ అధ్యక్షుడు మాణిక్ రావుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News