: వరంగల్ కు వైఎస్ షర్మిళ... నేటి నుంచి మలివిడత పరామర్శ యాత్ర


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేడు తెలంగాణలో మలి విడత పరామర్శ యాత్రను చేపట్టనున్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో నేడు ఆమె పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరార్శించనున్నారు. మరికాసేపట్లో హైదరాబాదులోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరనున్న షర్మిల నేరుగా వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం చేరుకుంటారు. ఈ యాత్రలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొంటారు.

  • Loading...

More Telugu News