: ‘అనంత’లో ఘోర ప్రమాదం... నాందేడ్ ఎక్స్ ప్రెస్ ను ఢీకొన్న లారీ... కర్ణాటక ఎమ్మెల్యే సహా ఆరుగురు దుర్మరణం


అనంతపురం జిల్లాలో రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బెంగళూరు నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వెళుతున్న నాందేడ్ ఎక్స్ ప్రెస్ ను గ్రానైట్ బండరాళ్లతో దూసుకువచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. అనంతపురం జిల్లా మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద రాత్రి 2.25 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియనప్పటికీ, లారీ బలంగా ఢీకొన్న కారణంగా నాందేడ్ ఎక్స్ ప్రెస్ లోని హెచ్1 బోగీ (ఏసీ బోగీ) నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో లారీలోని పెద్ద బండరాయి రైలులోని హెచ్1 బోగీని బలంగా ఢీకొనడంతో పాటు దానిపై పడిపోయింది. ఈ బోగీలో ఉన్న ఐదుగురు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. మృతి చెందినవారిలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేశ్ నాయక్ కూడా ఉన్నారు. ఇక రైలును ఢీకొన్న లారీలోని క్లీనర్ కూడా చనిపోయాడు. ప్రమాదం నేపథ్యంలో నాందేడ్ ఎక్స్ ప్రెస్ కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. వెనువెంటనే స్పందించిన అనంతపురం జిల్లా అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News