: ‘జాగృతి’ విస్తరిస్తోంది... మహారాష్ట్ర శాఖ ప్రారంభం


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి సంస్థ విస్తరిస్తోంది. నిన్నటిదాకా తెలంగాణ, ప్రవాస తెలంగాణ ప్రజలు ఉన్న అరబ్ దేశాల్లోనే ఈ సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తోంది. తాజాగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఇది విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నిన్న ఆ సంస్థ మహారాష్ట్ర శాఖ పురుడుపోసుకుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రాకు చెందిన శారదా నాట్యమందిర్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత ఈ శాఖను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా పాలల్లో నీళ్లలా కలిసిపోతారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News