: చాన్ సిస్టర్స్ చేతిలో సానియా మీర్జా జంట ఓటమి
సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ నుంచి సానియా మీర్జా, మార్టినా హింగిస్ ల జోడీ నిష్క్రమించింది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్లో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన చైనీస్ తైపీ అక్కాచెల్లెళ్లు హావో చింగ్ చాన్, యుంగ్ చాన్ చేతిలో వీరు ఓటమి పాలయ్యారు. గంట 14 నిమిషాల పాటు కొనసాగిన ఈ మ్యాచ్ లో చాన్ సిస్టర్స్ చేతిలో 4-6, 6-0, 6-10 తేడాతో సానియా జంట ఓడిపోయింది. వరుస విజయాలతో ఊపుమీదున్న సానియా, హింగిస్ జంట ఈ టోర్నీలో టాప్ సీడ్ గా బరిలోకి దిగింది.