: పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లడంపై స్పందించిన వీహెచ్


రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోరాదని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ప్రజల మధ్యలోకి వెళ్లి వారి సమస్యలను పవన్ తెలుసుకోవడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ప్రజల ఇబ్బందులపై స్పందించేవాడే నిజమైన నాయకుడు అని తెలిపారు. ఏపీకి కొత్త రాజధాని అత్యంత అవసరమని... అయితే, రైతుల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలవంతంగా భూములను లాక్కోవడం మంచిది కాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News